రాశి ఫలాలు
Astrology: త్వరలో వృషభ రాశిలో మహాలక్ష్మీ యోగం.. ఈ 3 రాశుల వారికి భారీగా ధనలాభం
Astrology | Zodiac signs: త్వరలో వృషభ రాశిలో కీలక పరిణామం చోటు చేసుకబోతోంది. వృషభ రాశిలో బుధుడు, శుక్ర గ్రహాలు కలవబోతున్నాయి. దీనినే మహాలక్ష్మీ యోగంగా పిలుస్తారు. ఆ ప్రభావం వల్ల మూడు రాశుల వారికి ఊహించని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడు గానీ, ఏదైనా ఇతర గ్రహంతో కలిసినప్పుడు గానీ.. అది నేరుగా మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బుధ గ్రహం ఇప్పటికే ఉన్న వృషభరాశిలో ఉంది. ఐతే త్వరలో శుక్రగ్రహం కూడా తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
శుక్రుడు సంపద, విలాసం, వైభవం, శృంగారం, ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా పేరుంది. మరోవైపు బుధుడిని మేధస్సు, తర్కం, సంభాషణ, సమాచార కారక గ్రహంగా పరిగణిస్తారు. అలాంటి ఈ రెండు గ్రహాలు... జూన్ 18న కలవనున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో దీనినే మహాలక్ష్మీ యోగం అంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
జ్యోతిష్యం దృష్ట్యా మహా లక్ష్మి యోగానికి ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత ఉంది. ఈ యోగం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఐతే ముఖ్యంగా మూడు రాశులకు మాత్రం విశేష ప్రయోజనాలు కలుగుతాయి. భారీగా ధనలాభం కలుగుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం : మీ రాశిలోని ద్వితీయ గృహంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది డబ్బు, వాక్కుకు సంబంధించినది. అందువల్ల ఈ సమయంలో మీకు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. కొత్త వస్తువలను కొనుగోలు చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు.. ఇప్పుడు మీ చేతికి అందుతుంది. మీడియా, టీచర్లు, మార్కెంటింగ్ రంగాల వారికి అదృష్టం కలిసి వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం: ఉద్యోగం, కార్యక్షేత్రంగా పరిగణించబడే పదవ ఇంట్లో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. ఇప్పటికే ఉద్యోగం పొందుతున్న వారికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రావచ్చు. లక్ష్మీ దేవత అనుగ్రహం మీపై ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఆర్థిక కష్టాలు రావు. మీరు ఆకుపచ్చ రత్నాన్ని ధరిస్తే..మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం: మీ రాశి నుంచి 11వ ఇంట్లో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది ఆదాయం, లాభాలకు సంబంధించినది. అందువల్ల మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. వ్యాపారంలో లాభాలు వస్తారు. త్వరలోనే ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు. దీని కారణంగా భవిష్యత్తులో బాగా డబ్బు వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి