షో మధ్యలో పోలీసులు ఎంట్రీ.. హైపర్ ఆది అరెస్ట్..?

 

'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. షో మధ్యలో హైపర్ ఆది ఎక్కడా అంటూ పోలీసులు ఎంట్రీ ఇవ్వడం దుమారం రేపుతోంది. ఆది కారుతో యాక్సిడెంట్ చేశాడని.. అతను చావుబతుకుల మధ్య ఉన్నాడని అన్నారు.
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్‌.. పంచ్‌లతో ఆడియన్స్‌ను నవ్వించడంలో ఆది స్టైలే వేరు. షో ఏదైనా.. స్టేజీ ఎక్కడైనా.. ఆది ఉన్నాడంటే కామెడీ పండాల్సిందే. తన పంచ్ డైలాగ్స్‌తో కడుపుబ్బా నవ్వించే ఆది.. పలు వివాదాల్లో సైతం ఇరుక్కున్న సంగతి తెలిసిందే. చాలా నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇవన్నీ పక్కనబెడితే.. తాజాగా ఓ షో మధ్యలో ఆది పర్ఫామెన్స్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది.

బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులతో.. డ్యాన్సులతో దగ్గరైన కార్యక్రమం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీవీ షో. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ స్థానంలో రష్మీ యాంకర్‌గా చేస్తుండగా.. నటి పూర్ణ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ప్రోమోలో ఏముందంటే..

'ఆరేయ్ ఆది నీకు సన్మానం చేద్దామని అనుకుంటున్నాం రా..' అని రాంప్రసాద్ అనగా.. 'అంటే సన్మానం చేసి వాడిలాగా (సుడిగాలి సుధీర్‌లాగా) నన్ను కూడా పంపిద్దామని అనుకుంటున్నారా..' అంటూ ఆది కౌంటర్ ఇస్తాడు. ఆది సన్మాన కార్యక్రమం జరుగుతుండగా.. ఓ అమ్మాయి మధ్యలో వచ్చి తనకు అన్యాయం జరుగుతుందంటూ రచ్చ చేస్తుంది. ఆది తనను మోసం చేశాడని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

అనంతరం 'నీ తొలిసారిగా కలకన్నది నిన్నే కదా..' ఆది డ్యాన్స్ చేస్తుండగా సందర్భంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆది ఎక్కడా అంటూ అడిగారు. ఆది కారులో వచ్చేప్పుడు యాక్సిడెంట్ చేశాడని.. అతను ఇప్పుడు చావుబతుకుల మధ్యలో ఉన్నాడని పోలీసులు అన్నారు. ఆదిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో అక్కడున్న ఆర్టిస్టులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఫస్ట్ కెమెరాలను ఆఫ్ చేయడంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగా షో మధ్యలోకి పోలీసులు వచ్చారా..? లేదా టీఆర్పీ రేటింగ్ కోసం షో నిర్వాహకులే ఏదైనా ఫ్రాంక్ ప్లాన్ చేశారా..? అనేది ఫుల్ ఎపిసోడ్ విడుదలైతే తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

'సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండిహైపర్ ఆదిశ్రీదేవి డ్రామా కంపెనీsridevi drama company promojabardasth comedian hyper aadijabardasthhyper aadi arrestHyper Aadicomedian hyper aadianchor rashmi gautam

Web Title : jabardasth comedian hyper aadi arrest in anchor rashmi gautam sridevi drama company show latest promo
Telugu News from Samayam Telugu, TIL Network

Devatha జూన్ 7: రుక్మిణి కీలక నిర్ణయం.. ఎదురు తిరిగిన ఆదిత్య ‘సత్య నా భార్య’

Authored by Samayam Telugu | Updated: Jun 7, 2022, 10:54 AM

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్.. నేడు(2022 జూన్ 7)న 566 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Devatha June 7 episode హైలైట్స్ చూద్దాం.

గత ఎపిసోడ్‌లో పిల్లలు స్కేటింగ్‌కి వెళ్తామని చెప్పడంతో రాధ వద్దు అంటుంది. ‘దెబ్బలు తగిలించుకుంటూ.. అంత కష్టం ఎందుకు బిడ్డా’ అంటుంది. అదే మాటను సమర్థిస్తారు రామ్మూర్తి, జానకి. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అవుతుంది.

undefined
‘దేవత’ జూన్ 7 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
566వ ఎపిసోడ్‌ హైలైట్స్..
రామ్మూర్తి, జానకి కూడా రాధ అన్నమాటకే సై అనడంతో పిల్లలు బేలముఖం వేస్తారు. ఇంతలో మాధవ కూడా వచ్చి.. ‘నిజమే తల్లీ.. ఈ వయసులో ఆ కష్టాలన్నీ ఎందుకు? మీరు ప్రశాంతంగా ఉండక’ అంటూ స్కేటింగ్‌కి వద్దు అంటాడు. వెంటనే రాధ.. ‘లే బిడ్డా మీరు పోండ్రి.. అన్ని నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మీకు అన్ని కష్టాలు తెలియాలి’ అంటుంది. జానకి, మాధవ, రామ్మూర్తి.. పిల్లలు అంతా షాక్ అవుతారు.

‘ఇప్పుడే కదమ్మా వద్దు అన్నావ్.. అంటుంది జానకి అయోమయంగా.. ‘అన్నా.. చోచాయిస్తే అర్థమైంది.. బిడ్డలకు కష్టం తెలియాలి..అందుకే పో మంటున్నా.. సరేకానీ పైకి వెళ్లి బట్టలు తెచ్చి.. అన్ని చక్కగా మడతపెట్టండి.. ఈ దినం నుంచి మీరు అన్ని పనులు నేర్చుకోవాలి’ అంటుంది. పిల్లలు అయిష్టంగా సరేనంటారు. మాధవ ఆలోచనలో పడతాడు. ‘పిల్లలతో ఒక్క పని కూడా చేయించని రాధ.. ఎందుకు ఇప్పుడు పనులు నేర్పిస్తోంది. తను ఇంట్లో వెళ్లాలని అనుకుంటోందా? అది జరగనివ్వను.. రాధ దారులన్నీ మూసేస్తాను’ అనుకుంటాడు మాధవ.

ఇక దేవుడమ్మ భర్త దగ్గరకు వెళ్లి.. ‘మీ అక్క నా కోడల్ని చాలా బాధపెట్టింది. పెళ్లి చేస్తానంటుంది ఏంటి..? ఇవన్నీ వద్దు అని మీరు చెబుతారా? నన్ను చెప్పమంటారా? పిలుపులకు వచ్చిన ఆమె పిలుపులకు వచ్చినట్లు ఉండాలి. పెత్తనాలు ఎందుకు చేస్తోంది? నా కోడలు బాధపడితే చూస్తూ ఊరుకోలేను’ అంటుంది. సీన్ కట్ చేస్తే.. చిన్మయి, దేవి పక్కలు సరిగా లేకపోవడం చూసి.. ‘అమ్మా అమ్మా.. బెడ్ మీద దుప్పటి వేయలేదా’అంటూ వస్తారు. ‘ఇక నుంచి ఆ పని కూడా మీరిద్దరే చేసుకోవాలే. వెళ్లండ్రి’ అంటూ దుప్పట్లు చేతిలో పెడుతుంది.

పాపం చిట్టి చిట్టి చేతులతో కష్టపడి పిల్లో కవర్స్ మార్చి.. దుప్పటి పరుచుకుంటూ ఉంటే.. రాధ దూరం నుంచి చూసి.. ‘తప్పడం లేదు బిడ్డా..’ అనుకుంటుంది. ‘ఇక నుంచి చిన్మయి నేను లేకపోయినా బతకడం నేర్చుకోవాలి. ఒకరి అవసరం లేకుండా పనులన్నీ నేర్పిస్తా.. నీ బిడ్డ(మాధవ మొదటి భార్యతో మాట్లాడుతూ) నా బిడ్డలా పెరిగింది. నువ్వేం పరేషన్ కావద్దు.. అంతా సరి చేసే.. చిన్మయికి అన్నీ నేర్పించే ఈ ఇంటి నుంచి వెళ్తాను.. ఇక చిన్మయి కోసం ఈ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేను.. అందుకే ఈ కష్టాన్ని పిల్లలకు పంచుతున్నా’ అని మనసులోనే మథనపడుతుంది.

మరునాడు ఉదయాన్నే దేవుడమ్మ ఆడబొడుచు.. అందరి ముందే.. తను చెప్పిన సంబంధం గలవారితో ఫోన్‌లో మాట్లాడుతుంది. ‘అబ్బాయి మంచి ఆఫీసర్.. నేను చెబితే కాదు అనరు.. మేమంతా ఇప్పుడే బయలుదేరతాం..’ అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది.

‘ఏంటి అలా దిష్టి బొమ్మలా నిలబడ్డారు అంతా.. పదండి రెడీ అయ్యి పెళ్లి కూతురు ఇంటికి వెళ్దాం’ అంటుంది. ఇంతలో సత్య, ఆదిత్య వస్తారు. ‘ఏం సత్యా నీ మొగుడ్ని ఒప్పించావుగా.. లేదంటే నీకు వేరే అవకాశమే లేదులే.. పదండి మరి వెళ్దాం’అంటూ హడావుడి చేస్తుంది. ‘అత్తయ్యా ఏంటి ఇదంతా? నాకు పెళ్లి అయ్యింది. సత్య నా భార్య.. అయినా పిల్లలు లేరు అని నీ దగ్గర మేమేం బాధపడలేదే?’ అంటూ మేనత్తకు ఎదురు తిరుగుతాడు ఆదిత్య. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

'సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి

దేవత సీరియల్ ఈరోజుదిదేవత సీరియల్దేవతdevatha todaydevatha serial today episodedevatha serial todaydevatha serial satyadevatha serial rukkudevatha serialdevatha june 7 episode
Web Title : madhava's family gets worried about radha's unpredictable behavior in devatha serial today 2022 june 7 episode
Telugu News from Samayam Telugu, TIL Network

Janaki Kalaganaledu జూన్ 7 (ఈరోజు) ఎపిసోడ్: రామా చెంప చెల్లు మనిపించిన జానకి.. చార్మినార్ వద్ద రీసౌండ్

Authored by Samayam Telugu | Updated: Jun 7, 2022, 10:10 AM

రామా అంటే జానకికి పంచప్రాణాలు.. చదువురాని వాడంటూ అందరూ తన భర్తని తక్కువ చేసి చూడటంతో.. అతన్ని ప్రయోజకుడ్ని చేయడంలో భాగంగా జాతీయ స్థాయి వంటల పోటీలకు అతన్ని హైదరాబాద్ తీసుకుని వస్తుంది. అయితే నేటి ఎపిసోడ్‌లో ఏమైందంటే..

నెక్స్ట్ ఏం జరగబోతుందనే విషయం ముందే తెలిసిపోతుంటే ఆ కథనంపై ఆసక్తి ఉండదు.. ‘జానకి కలగనలేదు’ సీరియల్ అలాగే కొనసాగుతుంది. వంటల పోటీ అంటూ గత మూడు నాలుగు వారాలుగా సాగదీస్తూ వస్తున్నారు. మొత్తానికి జానకి పట్టుపట్టి మరీ రామాని జాతీయ స్థాయిలో వంటల పోటీలో పాల్గొనేట్టు చేసింది. రామా అక్కడికి వెళ్లడం.. పోటీలో పాల్గొన్నవాళ్లు రామాని చదువులేని వాడంటూ హేళన చేయడం.. అది చూసి జ్ఞానాంబ బాధపడటం నిన్నటి ఎపిసోడ్‌లోని ముచ్చట్లు కాగా.. జానకి రామా చెంప చెల్లు మనిపించడం ఈరోజు (జూన్ 7) ఎపిసోడ్‌లో హైలైట్.. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. వంటల పోటీ తొలి రౌండ్లో భాగంగా.. ఒక్కొక్కరికీ వెయ్యి చొప్పున ఇచ్చారు. వాటితోనే కావాల్సిన వాటిని కొని ఇష్టమైన వంటను చేయాలని కాంపిటేషన్ పెట్టగా.. రామా మార్కెట్‌కు వెళ్లి తనకి కావాల్సిన వాటిని తీసుకుని వస్తాడు.

undefined
జానకి కలగనలేదు photo courtesy star maa and hotstar
అయితే తనకి ఇచ్చి అమౌంట్‌తో రూ.500 దానం చేసేస్తాడు రామా.. మిగిలిన రూ.500తోనే తన వంటకు కావాల్సిన మెటీరియల్‌ని తీసుకుంటాడు రామా. పోటీలో పాల్గొన్న వాళ్లు నిర్ణీత సమయానికి అన్నీ కొనుక్కుని వస్తారు కానీ.. రామా టైంకి రాడు. అనౌన్స్ మెంట్ వచ్చేయడంతో జానకి వెళ్లి రిక్వెస్ట్ చేసి కాస్త టైం ఇవ్వమని అడుగుతుంది.

వస్తువులు కూడా కొనడం చేతకాని వ్యక్తిలా ఉన్నాడు.. అతని కోసం కాంపిటేషన్ ఎలా ఆపుతాం అని అంటూనే ఐదు నిమిషాలు టైం ఇస్తారు.. ఈ ఐదు నిమిషాల్లో రాకపోతే కాంపిటేషన్ నుంచి తప్పిస్తాం అనిఅంటారు. ఇంతలో రామా పరుగుపరుగున వచ్చేస్తాడు. రామా తీసుకుని వచ్చిన వస్తువుల్ని చూసి అంతా నవ్వుతారు. మేం ఇచ్చిన అమౌంట్‌కి అందరూ చాలా ఎక్కువ తెస్తే.. మీరు ఏంటి ఇన్ని తక్కువ తెచ్చారని అడుగుతారు. ఈ కాంపిటేషన్ మొత్తాన్ని టీవీలో చూస్తూ ఉంటుంది జ్ఞానాంబ. ఇలాంటి ఒత్తిడిని వాడు తట్టుకోలేడు.. అందరి ముందు ఎలా తలదించుకున్నాడో చూడండి అని బాధపడుతుంది.

అయితే కాంపిటేషన్‌లో రామాని హేళన చేస్తూ అందరూ నవ్వుతుండగా.. జానకి సీన్‌లోకి వచ్చి.. ‘రామా గారి గురించి మీకు ఏం తెలుసు.. ఓ మనిషి గురించి మాట్లాడేముందు తెలుసుకుని మాట్లాడండి..’ అని క్లాస్ పీకుతుంది. ఇక్కడ విషయం అమౌంట్ ఏం చేశారని.. ముందు ఆ విషయం చెప్పండి అని అడుగుతుంది కాంపిటేషన్ నిర్వహిస్తున్న యాంకర్.

దీంతో రామా.. ఓ వ్యక్తి తన తల్లికి ఆరోగ్యం బాలేకపోవడంతో.. తనని డబ్బులు ఆడిగాడని.. తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చినట్టు చెప్తాడు రామా. కథలు బాగానే చెప్తున్నావ్.. ఈరోజుల్లో ఎవరి గురించి వాళ్లు ఆలోచించుకోవడమే ఎక్కువ.. నువ్వే వేరే వాళ్ల గురించి ఆలోచించావంటే నమ్మాలా.? అని ఓ అమ్మాయి హేళన చేయగా.. ‘మా రామాగారు ఆలోచిస్తారు..’ అని అంటుంది జానకి.

ఇది కాంపిటేషన్.. కొన్ని రూల్స్ ఉంటాయి.. వాటిని ఫాలోకావాల్సిందే.. ఈ రూల్స్ పాటించని వాళ్లని ఎలిమినేట్ చేయాల్సిందే అని యాంకర్ అనడంతో.. జానకి, రామాలలో కంగారు మొదలౌతుంది. దీన్ని టీవీలో చూస్తున్న మల్లిక.. తొలిరౌండ్లోనే ఓడిపోయారు అంటూ తెగ సంబరపడిపోతుంది.

ఇక రామా.. ‘వెళ్లిపోదాం జానకి గారూ.. నేను ఓడియాను.. అందరితో ఓడిపోయాను అని అనిపించుకోవడం కంటే వెళ్లిపోవడమే మంచిది కదా’ అని అంటాడు. గెలుపో ఓటమో.. ధైర్యంగా ఎదుర్కొనే వెళ్దాం’ అని నిర్ణయాన్ని జడ్జీలకు వదిలిపెడతారు. అయితే జడ్జీలు ఇందులో ఆలోచించడానికి ఏం లేదు.. ప్రాపర్టీస్ సరిగా ఉపయోగించలేదు కాబట్టి.. తొలిరౌండ్లో ఎలిమినేట్ అయ్యింది.. రామచంద్ర అంటూ అనౌన్స్ మెంట్ చేస్తారు. తొలిరౌండ్లోనే ఎలిమినేట్ కావడంతో.. రామా కుదేలైపోతాడు.. జానకికి జ్ఞానాంబ అన్న మాటలు గుర్తుకు వస్తాయి.. నా కొడుకుని అందరి ముందు అవమానపడేట్టు చేస్తావా? వాడిని అవమానించడానికే కంకణం కట్టుకున్నావా? అని అన్న మాటలు గుర్తుకువస్తాయి.. తన అత్తకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాననే బాధతో రామాని తీసుకుని వెనుతిరుగుతుంది జానకి.

ఇద్దరూ వెళ్తుండగా.. జడ్జీ స్థానంలో ఉన్న వ్యక్తికి ఫోన్ కాల్ వస్తుంది.. ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి రామాని వెనక్కి పిలుస్తారు. ‘ఈ రౌండ్ ఉద్దేశం.. వంట చేయడమే కాదు.. మానవత్వాన్ని వెలికి తీయడం.. మీరు షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తన తల్లికి సాయం చేయండని వేడుకున్న వ్యక్తి ఎవరో కాదు.. ఈ కాంపిటేషన్ వాలంటీర్.. అతన్ని అక్కడికి మేమే పంపించాం.. మీరు ఎవరూ సాయం చేయలేకపోయారు.. కానీ రామా.. అతనికి సాయం చేశాడు.. మానవత్వాన్ని చూపించాడు’ అంటూ రామాని ప్రశంసలతో ముంచెత్తుతారు.

అమ్మకి కష్టం అనగానే పోటీ గురించి ఆలోచించలేదు.. వెంటనే సాయం చేశావ్.. ఓటమి అంటే భయం లేదా? అని రామాని అడగడంతో.. ‘సాయం కోసం వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ.. అమ్మకి బాలేదు అనగానే.. నాకు నేను చేయగలిగిన సాయం మాత్రమే గుర్తుకు వచ్చింది.. కనిపించే దేవత అమ్మ.. ఆమెను బాగా చూసుకుంటే చాలు.. ముక్కోటి దేవతల్ని మొక్కినంత పుణ్యం వస్తుంది’ అని అమ్మ గురించి గొప్పగా చెప్తాడు రామా.

దీంతో రామా.. నెక్స్ట్ రౌండ్‌కి కాంపిటేషన్ లేకుండా డైరెక్ట్‌గా నామినేట్ అయినట్టు ప్రకటిస్తారు జడ్జీలు. ఇదంతా టీవీలో చూస్తున్న జ్ఞానాంబ ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోగా.. మల్లిక మాత్రం ఏడుస్తూ ఉంటుంది.

ఆ తరువాత గోవిందరాజులు.. రామాకి ఫోన్ చేస్తాడు. ‘ఒరేయ్ రాముడూ నిన్ను టీవీలో చూశాం రా.. మురిసిపోతున్నాం రా.. అమ్మ చాలా హ్యాపీగా ఉంది’ అని అంటాడు.. దీంతో రామా.. ‘అమ్మకి ఫోన్ ఇవ్వండి’ అని అడుగుతాడు. ఫోన్ తీసుకున్న జ్ఞానాంబ.. ‘నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది నాన్నా.. పోటీలో ఓడిపోతానని తెలిసి కూడా సాయం చేశావ్.. అని జాగ్రత్తలు చెప్తుంది. ఇవన్నీ నువ్ నేర్పించినవే అమ్మా.. నువ్ నేర్పిన విలువలే నన్ను ఇంతటి వాడిని చేసింది.. ఈ పోటీలో తప్పుకుండా గెలుస్తాను అని అంటాడు రామా.

ఇక ఔటర్ రింగ్ రోడ్డుపై జానకి-రామాలు ఫొటోలు తీసుకుంటూ మురిసిపోతుంటారు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి.. ఏం చేస్తున్నారని అడుగుతాడు. మొదటిసారి హైదరాబాద్ వచ్చాం.. గుర్తుగా ఫొటోలు తీసుకుంటున్నాం అని రామా చెప్పడతో.. ‘మీ ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీసుకుంటే సెక్యురిటీ ఇష్యూస్ వస్తాయి.. ఇది చాలా పెద్ద నేరం.. డబ్బులు తీయండి. ఐదు వేలు తీయండి’ అంటాడు. ఆ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకున్నారన్నది సస్పెన్స్ కాగా.. రామా చెంప చెల్లుమనిపిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చింది జానకి.

హైదరాబాద్ మొత్తం చక్కర్లు కొడుతుంటారు జానకి రామాలు. చార్మినార్ దగ్గరకు వెళ్లగా.. అక్కడ నుంచి రామా మాయమౌతుంది. రామా కోసం జానకి కంగారు పడుతుంది.. రామా గారూ అంటూ బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది.. ఇంతలో రామా భుజంపై చేయి వేస్తాడు. దీంతో జానకికి ప్రాణం లేచినట్టు అనిపిస్తుంది. ఆ కోపంలో రామా చెంప చెల్లుమనిపిస్తుంది. ఆ వివరాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

'సమయం వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి

మరింత సమాచారం తెలుసుకోండి

​janaki kalaganaledu serial todayజానకి కలగనలేదు సీరియల్జానకి కలగనలేదు ఈరోజు ఎపిసోడ్జానకి కలగనలేదుjanaki kalaganaledu today episodejanaki kalaganaledu telugu serialjanaki kalaganaledu serialjanaki kalaganaledu june 6 episodejanaki kalaganaledu 316 episodejanaki kalaganaledu
Web Title : janaki slapped ramachandra in janaki kalaganaledu 2021 june 07 episode preview
Telugu News from Samayam Telugu, TIL Network


కామెంట్‌లు